గుండ్లపాడు జంట హత్యల కేసులో పరారీలో ఉన్న కండ్లకుంట సర్పంచ్ పిన్నెల్లి వెంకటరెడ్డి సోమవారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు. పోలీసులు కోర్టు పరిసరాల్లో భారీగా మోహరించారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో నిందితుడిని గుంటూరు సబ్ జైలుకు తరలించారు.