నేడు మాచర్ల పట్టణంలో రెండవ శనివారం సందర్భంగా విద్యుత్ సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడనున్నట్లు ఏఈ కోటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33/11 సబ్ స్టేషన్లు, 11 కేవీ లైన్స్ మెయింటనెన్స్ పనుల నిమిత్తం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. మరమ్మత్తు పనులు అనంతరం తిరిగి విద్యుత్ సరఫరా కొనసాగుతుందన్నారు.