ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో ప్రజల నుంచి భూ వివాదాలు, రెవిన్యూ సమస్యలు, నూతన పింఛన్ల మంజూరు వంటి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు.