అమరావతికి మరో 3 కొత్త 108 అంబులెన్సులు

రాజధాని అమరావతి ప్రాంతంలో అత్యవసర వైద్య సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మూడు కొత్త 108 అంబులెన్స్ యూనిట్లను మంజూరు చేసింది. సీఆర్‌డీఏ పరిధిలోని రాయపూడి, ఐనవోలు, ఉండవల్లి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో 'గోల్డెన్ అవర్'లో వేగంగా వైద్య సేవలు అందించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఇందుకోసం ఏడాదికి రూ. 90. 79 లక్షలు వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్