అమరావతి ఘర్షణల కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు నూనె ఉమామహేశ్వరరెడ్డి ఈ ఘటనలో పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలింది. తన అనుచరులతో కలిసి ఘర్షణ జరిగిన ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పానుగంటి చైతన్యను నిందితుడిగా చేర్చగా, దర్యాప్తు కొనసాగుతోంది.