తాడేప‌ల్లిలో ఎదురెదురుగా ఢీకొన్న ఆటోలు

తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సెంటర్ కొత్తకాలువ వంతెన వద్ద శనివారం రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో విజయవాడ భవానీపురానికి చెందిన జగదీష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 ద్వారా క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. మరో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్