విద్యుదాఘాతంతో ఒప్పంద కార్మికుడి మృతి

మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగంలో వెల్డర్గా పనిచేస్తున్న అనీల్ కుమార్ (51) నులకపేటలో పైపులైనుకు వెల్డింగ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు గత 20 ఏళ్లుగా ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సంఘటనా స్థలాన్ని నగరపాలక కమిషనర్ అలీంబాషా పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్