ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకట రవి సోమవారం తెలిపారు. మంగళగిరి మండలం బేతపూడికి చెందిన వాసా రాంబాబు, రేవేంద్రపాడుకు చెందిన రహీమ్ లు ద్విచక్రవాహనాలు చోరీ చేసి తాకట్టు పెట్టి. ఆ నగదుతో ఉడాయిస్తుంటారు అన్నారు. వీరిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరు పర్సనల్ తెలిపారు.