ఆటా మహాసభలకు జగన్‌కు ఆహ్వానం

అమెరికాలో జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ ఆటా మహాసభలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిని ఆటా ప్రతినిధులు తాడేపల్లిలో బుధవారం కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. మహాసభలు విజయవంతంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్