మంగళగిరిలో నివాసం ఉంటున్న జాహ్నవి (7) గత కొంతకాలంగా చేతులలో పట్టుత్వం లేక ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమెను మంగళగిరిలో గల ఒక ఫిజియోథెరపీ సెంటర్కు తీసుకొని వెళ్లారు. ఫిజియోథెరపీ చేస్తున్న డాక్టర్ అవగాహన లోపం వల్ల ఫిజియోథెరపీ చేసే సమయంలో తుంటి ఎముక విరగ్గొట్టారు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో సోమవారం నాడు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.