పెదవడ్లపూడి గంగానమ్మ గుడి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఒక నివాసంలో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు. తెల్లవారుజామున ఇంటి వెనక తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించి బీరువాలో సుమారు 100 గ్రాములకు పైగా బంగారం, మూడు కిలోలు వెండి, 50 పట్టుచీరలు, రెండు లక్షలకు పైగా నగదు దోచుకెళ్లారని తెలిపారు. దీనిపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.