ఉండవల్లికి చెందిన కిరణ్ అనే టిప్పర్ యజమానిని, రిపోర్టర్ గా చెప్పుకునే వ్యక్తి డబ్బుల కోసం బెదిరిస్తున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేసి రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తానని బెదిరించినట్లు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరి రూరల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.