రాష్ట్రంలో అరాచటమే లక్ష్యంగా వైసిపి కుట్రలు చేస్తుంది అని మంత్రి కొల్లు రవీంద్ర మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విగాథలను కల్పించాలని, ఒక కుట్రపూరిత కార్యక్రమాలు చేయడానికి ఏ విధంగా పూనుకుందో ఇవాళ జరుగుతున్న పరిణామాలే ఉదాహరణని అన్నారు.