మంగళగిరి: వాహన ఉత్సవంలో అపశృతి..

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ముత్యాల పందిరి వాహనం ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ధ్వజస్తంభం వద్ద ఊరేగింపుగా బయలుదేరిన క్రమంలో వాహనం ఒక్కసారిగా ఒరిగిపోయింది. దేవస్థాన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, ఉత్సవ విగ్రహాలు కింద పడకుండా కాపాడారు. ఒకపక్కకు ఒరగడంతో భక్తులతో కొద్దిసేపు కంగారు పడినప్పటికీ అంతా సజావుగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్