మంగళగిరి ఖాజా టోల్ ప్లాజా వద్ద మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రైవేట్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 20కి పైగా బస్సులను పరిశీలించగా, నిబంధనలు ఉల్లంఘించిన ఒక బస్సును సీజ్ చేశారు. అలాగే, 15 బస్సులకు జరిమానాలు విధించారు. ప్రయాణికుల భద్రత కోసం ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.