పశ్చిమగోదావరి వైసీపీకి చెందిన నలుగురు జడ్పీటీసీలు బుధవారం జనసేన పార్టీలో చేరారు. ఈ మేరకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలోని కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన నలుగురు జడ్పీటీసీలు జనసేన కండువా కప్పుకున్నారు. స్వయంగా పవన్ కళ్యాణ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ విధివిధానాల నచ్చి పార్టీలో చేరుతున్నట్లు జడ్పిటిసిలు తెలిపారు.