మంగళగిరి: వైసిపి పాలనలో మహా అపచార

కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కల్యాణం శివ శ్రీనివాసరావు మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, వైకాపా పాలనలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో మహాపచారం జరిగిందని ఆరోపించారు. వైకాపా హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టులో తీవ్ర అవినీతి జరిగిందని, జంతు కొవ్వుతో తయారైన రసాయనాలు లడ్డూ ప్రసాదంలో ఉన్నాయన్న వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కల్తీ నెయ్యి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఉప ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం అర్థరహితమని తెలిపారు.

సంబంధిత పోస్ట్