రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన మండేపూడి శేషారత్నం (63) అవయవాలను దానం చేసి మరో నలుగురికి జీవం పోశారు. నిడమర్రుకు చెందిన ఆమెను జూలై 1న గాయాలతో మంగళగిరి ఎయిమ్స్ లో చేర్చగా, జూలై 8న బ్రెయిన్‌డెడ్ అని వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యుల సమ్మతితో కాలేయం, కిడ్నీలు, కళ్లను విభిన్న ఆసుపత్రులకు పంపించారు. ఎయిమ్స్‌లో ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.