2023 జనవరిలో నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ గుప్తా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. దీంతో 6,100 పోస్టులకు సంబంధించి ఈ రోజు ఫలితాలు విడుదలయ్యాయి.