ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి లోకేష్ గురువారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశామని ఆయన అన్నారు. రాష్ట్రంలోని కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతుంటే తాను బాధపడినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వం కలిసి పని చేద్దామని హామీ ఇచ్చింది అన్నారు.