తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జగన్ ప్రభుత్వం కక్ష కట్టిందని, అనేక రసాయనాలు కలిసిన దానికి ఆవునెయ్యి అని ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. 300 ఏళ్లుగా వస్తున్న లడ్డూ ప్రసాదంపై జగన్ విషం చిమ్మారని, టెండర్ నిబంధనల సడలింపుపై వైవీ సుబ్బారెడ్డి సంతకం చేశారని, ఇది కుంభకోణమే కాదని, హిందూత్వంపై దాడి అని ఆమె దుయ్యబట్టారు. జగన్, కరుణాకర్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారని అనురాధ ఆరోపించారు.