దేవుడిపై అపారమైన నమ్మకం ఉందని, తప్పు చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శాసన మండలిలో మాట్లాడుతూ, మార్కెట్ ధర పెరిగిందని, కల్తీ నెయ్యి వాడాలా అని ప్రశ్నించారు. లడ్డూలో కల్తీ జరిగిందని సీబీఐ నివేదికలో స్పష్టంగా ఉందని, తప్పు చేసిన వారిని దేవుడు శిక్షిస్తాడని లోకేశ్ పేర్కొన్నారు.