తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన వెంకాయమ్మ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఆర్థిక సాయం చేశారు. వెంకాయమ్మ కి 50వేల రూపాయలను వైద్య ఖర్చులు నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. గతంలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా గుంటూరు కలెక్టర్ ఆఫీస్ లో బహిరంగంగానే 2024 లో టిడిపి ప్రభుత్వం వస్తుంది అంటూ తనకున్న భూమిని పందెంకాసిన వ్యక్తిగా వెంకాయమ్మ అందరికీ తెలుసు.