మంగళగిరిలోని అమరావతి క్రికెట్ స్టేడియంను విజయవాడ ఎంపీ కేశినేనిచిన్ని బుధవారం సందర్శించారు. రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ స్టేడియంలో వచ్చే మే నాటికి మౌలిక సదుపాయాలన్నీ పూర్తవుతాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఏపీఎల్ మ్యాచ్ ప్రారంభోత్సవం జరుగుతుందని ఎంపీ కేశినేనిచిన్ని పేర్కొన్నారు.