టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ పార్టీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా నాలుగు వారాల పాటు కేడర్ సమావేశాలు, గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించని పలువురు నాయకులను ఆయన మందలించారు. ఆయా కార్యక్రమాలు ఎందుకు నిర్వహించలేదో కారణాలు తెలుసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలని, ఇకపై ఇలానే వ్యవహరిస్తే సహించేది లేదని లోకేశ్ స్పష్టం చేశారు.