కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. "విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తీవ్ర ఆవేదనకు లోనయ్యా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు తెలుగు తెరపై ప్రతి నాయకుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభీరమైన పాత్రలు పోషించారు. " అని అన్నారు.