భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి అవమానం. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి చూపుడు వేలు లేకుండా దర్శనమిస్తుంది. కనీస నిర్వహణ లేకుండా ఉంది. కార్పొరేషన్ కార్యాలయానికి నిత్యం వందలాది మంది వస్తుంటారు పోతుంటారు అధికారులు ప్రజలు ఎవరూ చూడలేదా? అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.