వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. గత నెల 31వ తేదీ సాయంత్రం తెదేపా రీసెర్చ్ కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు తోపూరి గంగాధర్, పాతర్ల రమేష్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.