తాడేపల్లి: 193 బస్సులపై కేసులు నమోదు..

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులు తరలిస్తున్న, అధిక లోడ్తో నడుస్తున్న బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో, నిన్న రాష్ట్రవ్యాప్తంగా 976 బస్సులను తనిఖీ చేయగా, సరైన పత్రాలు లేని 193 బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని టోల్ ప్లాజాలు, చెక్ పోస్టులు సహా మొత్తం 16 పాయింట్లలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్