రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ బుధవారం కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలు, పెనుమాక రిజర్వాయర్‌ను పరిశీలించారు. వాగుల ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 400 ఎకరాల రైతులకు ప్లాట్లు కేటాయించామని, కోర్టు కేసులు పరిష్కారమైన తర్వాత మరో 2 వేలకుపైగా ప్లాట్లు కేటాయిస్తామని తెలిపారు. ఉండవల్లి రైతులు భూసేకరణకు సహకరించాలని కోరారు. అమరావతిపై తప్పుడు ప్రచారం మానుకోవాలని, మాజీ సీఎం జగన్ రాజధాని ప్రాంతాన్ని సందర్శించాలని సూచించారు.