తాడేపల్లి: 17న మహాసభను జయప్రదం చేయండి

ఈనెల 17న గురువారం సిపిఐ తాడేపల్లి ప్రాంత మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ తాడేపల్లి ప్రాంత కార్యదర్శి కంచర్ల కాశయ్య పిలుపునిచ్చారు ఆదివారం తాడేపల్లి సిపిఐ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇస్తా అన్న భూమిని మరియు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలని అన్నారు

సంబంధిత పోస్ట్