తాడేపల్లి: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బీబీఏ విద్యార్థిని హర్ష (20) మృతి చెందింది. ద్విచక్ర వాహనం మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఆమె రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. ఎయిమ్స్‌కు తరలించగా వైద్యులు మృతిని నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్