మున్సిపల్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి: సీఐటీయూ

గత జులై నెలలో మున్సిపల్ కార్మికుల సమ్మె కాలపు వేతనాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఈరోజు వరకు చెల్లించలేదని వెంటనే ఆ వేతనాన్ని చెల్లించాలని రాజధాని డివిజన్ సీఐటీయూ నేత రవి కోరారు. మున్సిపల్ కార్మికుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పొడిగించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యూటీ, హెల్త్ కార్డులు ఇవ్వాలని, 12వ పిఆర్సి అమలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎం బుక్ కార్మికులకు, డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. 12వ తేదీన ఉండవల్లిలో జరిగే కార్మిక ప్రదర్శనలో కార్మికులు తమ కుటుంబాలతో సహా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్