తాడేపల్లి: రౌడీ షీటర్ నుంచి ప్రాణహాని ఉంది.

రౌడీషీటర్ బన్నీ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు నాని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరిగిన దాడిని మీడియా ముందు వెల్లడిస్తూ, బన్నీ విచక్షణ కోల్పోయి తీవ్రంగా దాడి చేశాడని, 'పోలీసులను కొంటాను, నిన్ను చంపేస్తాను' అంటూ బెదిరించాడని నాని తెలిపారు. ప్రాణభయంతో ఉద్యోగం వదిలి ఇంటికే పరిమితమయ్యానని, దాడి వీడియో బయటకు రావడంతో ధైర్యం వచ్చిందని, ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యానని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్