ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద 41. 1 అడుగులకు నీటిమట్టం నమోదైంది. ధవళేశ్వరం వద్ద ఇన్, అవుట్లో 5. 29 లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు సమాచారం. కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఎస్ఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు. వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈత, చేపలు పట్టడం, స్నానాలు నిషేధమని తాడేపల్లిలోని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.