హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం: హనుమంతరావు

మంగళగిరిలో బుధవారం వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన "వెన్నుపోటు దినం" నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. మహిళలకు ప్రతి నెల ఇవ్వాల్సిన రూ. 1, 500 ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు అందించాల్సిన రూ. 3, 000 నిరుద్యోగ భృతి రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంచారని మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్