మంగళగిరి మండలం యర్రబాలెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శనివారం నాడు వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. పీహెచ్సీలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి కనిపించకుండా గుడ్డలు కట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విగ్రహానికి ముసుగు తొలగించి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ పేదల గురించి ఆరోగ్యశ్రీ పథకం మొదలుపెట్టి వారి గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు.