పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్వీయ జనగణనపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆదివారం 5కే రన్ నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ, ఆర్డీఓ బాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. రాబోయే సెన్సస్ 2027లో ప్రతి పౌరుడు బాధ్యతగా పాల్గొనాలని, కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ (se.census.gov.in) ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.