నరసరావుపేటలోని బరంపేట మసీదు వెనుక బజార్ ప్రాంతంలో ఐదు రోజులుగా AP39 NK 1739 నంబర్ గల పల్సర్ బైక్ అనుమానాస్పదంగా నిలిచి ఉండటం స్థానికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి ఈ బైక్‌ను అక్కడే వదిలి వెళ్లినట్లు సమాచారం. బైక్ యజమాని వివరాలు, దానిని అక్కడ వదిలివేయడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.