నరసరావుపేటలో కోచింగ్ సెంటర్‌పై ఆరోపణలు

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డాక్టర్ ఆకాష్ నీట్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులపై వేధింపులు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. సెంటర్ డైరెక్టర్ ప్రభాకర్, కరెస్పాండెంట్ లక్ష్మారెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించడానికి వెళ్లిన తల్లిదండ్రులపై దాడికి యత్నించారని కూడా ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై ఓ బాలిక నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, కోచింగ్ సెంటర్ యాజమాన్యాన్ని విచారించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్