పల్నాడు జిల్లా SP కార్యాలయంలో ఎమ్మెల్యే కె. అరవింద్ బాబు ప్రదర్శించిన అసభ్య వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. IPS అధికారులను బ్లాక్‌మెయిల్ చేయడం అత్యంత దారుణమని, ఆ ఎమ్మెల్యేపై తక్షణమే వివిధ IPC సెక్షన్ల కింద FIR నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రవర్తన అధికారుల గౌరవాన్ని దెబ్బతీస్తుందని, IAS, IPS సంఘాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించే అధికారులను పూర్తిగా గౌరవించాలని గోపిరెడ్డి హితవు ఇచ్చారు.