సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా "అన్నదాత సుఖీభవ" పథకాన్ని శనివారం (2వ తేదీ) కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. దీనిలో భాగంగా వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో శుక్రవారం పండుగ వాతావరణం మధ్య ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు హాజరై ప్రారంభించనున్నారు.