కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలు: HPV వ్యాక్సిన్ ముమ్మరం

పల్నాడు జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల్లో ఏప్రిల్ 9న గురువారం 'గ్రామ ఆరోగ్య దర్శిని' కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. 9-14 ఏళ్ల బాలికలకు HPV వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు, స్వచ్ఛత, ఆరోగ్య పరిశీలనలు, ఇన్‌ఫెక్షన్ల నివారణపై అవగాహనా వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సూచించారు. HPV వ్యాక్సిన్ భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ ముప్పును 90% వరకు అరికట్టగలదని, దీని ప్రాముఖ్యతను గ్రామస్థులకు వివరించాలని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్