ఎక్సైజ్ ఆకస్మిక తనిఖీలు.. మద్యం శాంపిల్స్ సేక

ఈపూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రొంపిచర్ల, బొల్లాపల్లి మండలాల్లో ఆదివారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రొంపిచర్లలోని నీలకంటేశ్వర, త్రికోటేశ్వర వైన్స్ షాపులతో పాటు బొల్లాపల్లిలోని గణేశ్, వెంకటేశ్వర, పరమేశ్వరి వైన్స్ దుకాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మద్యం నిల్వలు, రికార్డులు, విక్రయ విధానాన్ని పరిశీలించిన అధికారులు నాణ్యత నిర్ధారణ కోసం పలు బ్రాండ్ల మద్యం సీసాలను శాంపిల్స్‌గా సేకరించి, రసాయన పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపనున్నట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్