మండలంలోని రొంపిచర్లలో బంగారంపై కలకలం రేగిన విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి రొంపిచర్లలోని బ్యాంక్ వద్దకు ఈనెల 28వ తేదీన బంగారు తాకట్టు పెట్టడానికి వచ్చాడు. సదరు బంగారాన్ని నరసరావుపేటలోని ఓ ప్రముఖ బంగారం షాపులో కొనుగోలు చేశాడు. ఐతే అతను తీసుకువచ్చిన రెండు వస్తువుల్లో ఒకటి బ్యాంక్ నియమాలకు సరిపోయిందని, మరొకటి సరిపోలేదని తిరస్కరించినట్టు మేనేజర్ తెలిపాడు.