నరసరావుపేట–గుంటూరు రోడ్డుపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఫిరంగిపురం మండలం మునగపాడు గ్రామానికి చెందిన పార్వతి అక్కడికక్కడే మృతి చెందారు. నందిని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. లారీ పైనుంచి వెళ్లడంతో ఈ ఘోరం జరిగినట్లు సమాచారం. బ్యాంకు పని నిమిత్తం వీరు నరసరావుపేటకు వచ్చారు. గుంటూరు రోడ్డులోని పాత ఆర్డీవో ఆఫీస్ వద్ద లారీ ఢీకొట్టింది.