నరసరావుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ, సత్యం, అహింస అనే ఆయుధాలతో భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని గుర్తు చేశారు. బాపూజీ చూపిన సత్యమార్గం, అహింసా సిద్ధాంతాలు నేటి సమాజానికి మరింత అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.