నరసరావుపేటలో బంగారం పేరుతో భారీ మోసం జరిగింది. తక్కువ ధరకు బంగారు నాణేలు ఇస్తామని చెప్పి, విజయవాడలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న తిరుపతిరెడ్డి అనే వ్యక్తి వద్ద నుంచి రూ.20.25 లక్షలు తీసుకుని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కారులో ఉడాయించాడు. బిల్లులు లేని బంగారు నాణేలు ఇస్తామని నమ్మించి ఈ మోసానికి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.