నరసరావుపేటలో ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వ బడులే పునాది అని అన్నారు. 'ప్రభుత్వ బడిలోనే విద్యార్థులను చేర్పిద్దాం. ఊరి బడిని కాపాడుకుందాం' అనే అవగాహన పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.