నాగార్జునసాగర్ కుడి కాలువ పరిధిలోని రైతులకు పంటలు ఎండిపోకుండా మార్చి చివరి వరకు సాగునీరు అందించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. పిడియం నాయకులు నల్లపాటి రామారావు మాట్లాడుతూ, ప్రస్తుతం అమలు చేస్తున్న వారబందీ విధానం వల్ల పంటలు నష్టపోతున్నాయని, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారబందీని ఎత్తివేసి, మార్చి చివరి వరకు నిరంతరంగా సాగునీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.